గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
Kerala Actress: కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటి చిత్ర (56) గుండెపోటుతో ఈ ఉదయం కన్నుమూశారు. కేరళలోని ఆమె స్వగ్రామమైన సాలిగ్రామంలో

కొచ్చి: కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటి చిత్ర (56) గుండెపోటుతో ఈ ఉదయం కన్నుమూశారు. కేరళలోని ఆమె స్వగ్రామమైన సాలిగ్రామంలో ఆమె తుదిశ్వాస విడిచారు. చిత్ర భర్త, ఒక కుమార్తె ఉన్నారు. ఈ రోజే ఆమె అంత్యక్రియలు పూర్తిచేయనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా చిత్ర తన సొంత పేరు కంటే నల్లెన్నై (జింజెలీ ఆయిల్ (నువ్వుల నూనె)) అనే పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు.
ఎందుకంటే ఆమె అప్పట్లో కేరళలో టాప్ బ్రాండ్ అయిన నల్లెన్నై అనే నువ్వుల నూనెకు సబంధించిన వాణిజ్య ప్రకటనలో నటించారు. అప్పటి నుంచి ఆమె పేరు నల్లెన్నైగా మారిపోయింది. కొచ్చిలో జన్మించిన చిత్ర 1990ల్లో తమిళ చిత్రసీమలో స్టార్‌గా ఎదిగింది. రజినీకాంత్, శరత్‌కుమార్, ప్రభు లాంటి అగ్ర హీరోల సరసన ఆమె నటించారు. 1975లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ చిత్రను బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు.
అ తర్వాత తన సమకాలికులైన కమల్‌హాసన్, శ్రీవిద్యలతోపాటు చిత్ర కూడా పాపులర్ నటిగా ఎదిగారు. ఆమె మలయాళంతోపాటు తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా నటించారు. కొన్ని టీవీ సీరియళ్లలో కూడా చిత్రకు మంచి గుర్తింపు లభించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

