Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్

Nani vs Theater Owners |నాని పిరికివాడు.. డబ్బులకు ఆశపడే తన సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నాడు అంటూ ఈ మధ్యే ప్రెస్ మీట్లో థియేటర్స్ అసోసియేషన్‌లోని కొంతమంది ఎగ్జిబిటర్స్ విమర్శించారు. నాని అసలు హీరోనే కాదు.. జీరో అంటూ వాళ్లు కోపంతో ఊగిపోయారు. సినిమా థియేటర్స్ లేకపోతే హీరోలు లేరు.. నాని కూడా దీనికి మినహాయింపు కాదు అంటూ వాళ్లు మండిపడ్డారు. అయితే ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇండస్ట్రీ నుంచి కొందరు సినీ పెద్దలు ఎగ్జిబిటర్స్‌ను తీవ్రంగా తప్పు పట్టారు. అందులో నాని తప్పేముంది.. సినిమాను ఎక్కడ విడుదల చేయాలి అనేది నిర్మాత చేతుల్లో ఉంటుంది.. కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేసినప్పుడు అది ఎక్కడ విడుదల చేసుకోవాలి అనే స్వాతంత్య్రం కూడా నిర్మాత నిర్ణయిస్తాడు అంటున్నారు విశ్లేషకులు. మరి నానిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
మొన్న సురేష్ బాబు నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు.. అందులో వెంకటేష్ లాంటి పెద్ద హీరో నటించాడు కదా..? మరి అప్పుడు ఎందుకు ఎవరూ ముందుకు రాలేదు.. అభ్యంతరాలు చెప్పలేదు.. ఇప్పుడు నాని సినిమా విషయంలో ఎందుకు నోరు పెద్దది చేస్తున్నారు అంటూ థియేటర్స్ అసోసియేషన్‌ను కొందరు సినీ పెద్దలు ప్రశ్నించారు. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ విషయంలో అనవసరంగా అతడిని ఎందుకు లాగుతున్నారని అడుగుతున్నారు. ఈ వివాదం అంతా టక్ జగదీష్ సినిమా దగ్గర మొదలైంది. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కాబోతుంది. అదే రోజు థియేటర్స్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక్కడే కాంట్రవర్సీ మొదలైంది.
తమ సినిమా వస్తుందని తెలిసినా కూడా కావాలని ఓటీటీలో నాని సినిమా విడుదల చేస్తున్నారు అంటూ మీడియా ముందుకు వచ్చారు ఎగ్జిబిటర్స్. అక్కడ కొందరు థియేటర్ ఓనర్లు కాస్త కంట్రోల్ తప్పి హీరో నానిని వ్యక్తిగతంగా విమర్శించారు. భవిష్యత్తులో నాని సినిమాలను థియేటర్లలో విడుదల చేయకూడదు అని నిర్ణయించారు. ఈ విషయం సినీ పెద్దల వరకు వెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తాజాగా థియేటర్స్ అసోసియేషన్ నానికి క్షమాపణ చెబుతూ ఒక లేఖ విడుదల చేసింది. కొందరు కోపంతో మాట్లాడిన మాటలు కానీ.. ఎవరు మనసులోంచి చెడు ఉద్దేశంతో అన్న మాటలు కాదు అర్థం చేసుకోండి అంటూ లెటర్ విడుదల చేసింది. దాంతో నాని వర్సెస్ ఎగ్జిబిటర్స్ వివాదం ఇక్కడితో సమసిపోయినట్లే అనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలని వదిలేసి బిజినెస్ చేసే ఆలోచనలో మంచు మనోజ్..!
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

