Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గోవా (Goa)లోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహానికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని (Wedding Video) రకుల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో హల్దీ, సంగీత్, వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను క్యాప్చర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్ – జాకీ భగ్నానీ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలం చిత్రంలో కనిపించింది.
Also Read..
Om Bheem Bush | శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే.?
Vyooham | మళ్లీ పోస్ట్‌పోన్ అయిన ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ నయా అప్డేట్.. రామ్‌చరణ్‌తో భారీ యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్న శంకర్