Rakshasudu-2 Movie New Poster | ‘అల్లుడు శ్రీను’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై ఘన విజయం సాధించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌కు మొదటి కమర్షియల్ హిట్‌గా రాక్షసుడు నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో శ్రీనివాస్ నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ. 23 కోట్ల వరకు కలెక్షన్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ మీట్లోనే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టైటిల్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. కాగా సోమవారం రమేష్ వర్మ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
‘ఇట్స్ నాట్ ఎ సీక్వెల్’ అంటూ రాక్షసుడు-2 కొత్త టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మేకర్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభకానుంది. కాగా ఈ సినిమాలో నటీ నటులు గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే గతంలో విజయ్ సేతుపతి ఈ సీక్వెల్లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ ఆ వార్తలపై స్పందించలేదు. ఈ చిత్రాన్ని హావిష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్య నారాయణ కోణేరు నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సింగర్ సాగర్ డైలాగ్స్ రాస్తున్నాడు.
Wishing a very Happiest Birthday to our Supremely Talented Director @DirRameshVarma, Who delivers blockbusters with Ease from Team #Rakshasudu2 ❤️🔥
We Can't Wait to Kickstart our New Endeavour 💥
Coming Soon to Scare you In Telugu – Hindi – Tamil – Malayalam#HBDRameshVarma pic.twitter.com/AkwENKJWxz
— A Studios LLP (@AstudiosLLP) August 22, 2022