హీరోయిన్గా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారట నటి మృణాల్ ఠాకూర్. ఇవన్నీ తనను మానసికంగా బలవంతురాలిని చేశాయంటున్నారామె. ఇటీవలే మృణాల్ లగ్జరీ మెర్స్డెస్ బెంజ్ కారును కొన్నారు. ఈ సందర్భంగా ఆనందం వెలిబుచ్చుతూనే తన జీవితంలో ఎదురైన మరిచిపోలేని అవమానాన్ని కూడా గుర్తు చేసుకుందీ భామ. ‘నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. నన్ను పెంచేందుకు అమ్మ చాలా కష్టపడింది. ఇంట్లో డబ్బులు ఉండేవి కావు. అలాంటి రోజుల్లో బంధువులే మమ్మల్ని చిన్నచూపు చూసేవారు.
మా అమ్మను కారు కూడా ఎక్కనిచ్చేవారు కాదు. కారెక్కే అర్హతే మా అమ్మకు లేదన్నట్టు అవమానించారు. ఓ సందర్భంలో మా అమ్మను ఒంటరిగా వదిలేసి కారులో వెళ్లిపోయారట. ఆ సంఘటన నన్ను కలచివేసింది. అప్పడే డబ్బు సంపాదించాలి. ఖరీదైన కారులో అమ్మను తిప్పాలని డిసైడ్ అయ్యాను. ఆ కల నేటికి తీరింది. మా బంధువుల్లో ఎవరికీ లేని బెంజ్కారును కొన్నాను’ అని చెప్పుకొచ్చారు మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్-అట్లీ చిత్రంలో నటిస్తున్నది.