అధిక లాభాలు వస్తాయని ఆశపెట్టి.. రూ.51.23 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఆన్లైన్ పెట్టుబడులు పెడితే అధికలాభాలు ఇస్తామంటూ చెప్పిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.51లక్షలు దోచేశారు.
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ పెట్టుబడులు పెడితే అధికలాభాలు ఇస్తామంటూ చెప్పిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.51లక్షలు దోచేశారు. నగరంలోని మలక్‌పేట ప్రాంతానికి చెందిన 60 ఏండ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఈ నెల మొదటి వారంలో ఫేస్బుక్లో ఐఐఎఫ్ఎల్ పేరుతో ఒక ప్రకటన చూశారు. ఆ కంపెనీ లింక్ క్లిక్ చేయగానే ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ నుంచి గోషన్యాదవ్ అనే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుని వాట్సాప్ మెసేజ్‌లు పంపించాడు.
ఐపీఓ కేటాయింపులతో పాటు పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించి మొదట రూ.8వేలు పెట్టించాడు. బాధితుడికి ఈ విషయంలో లాభాలు రావడంతో విడతల వారీగా ఈ నెల 25వ తేదీ వరకు రూ.51.23లక్షలు పెట్టుబడిగా పెట్టారు. దీంతో అతడికి రూ.1.30 కోట్ల లాభం వచ్చినట్లు చూపించారు. అయితే డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని చూస్తే మరో రూ.51లక్షలు చెల్లించాలని నేరగాళ్లు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

