బాపు ‘వంశవృక్షం’(1980)లో తొలిసారి తెలుగుతెరపై కనిపించారు బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్ కపూర్. ఆ తర్వాత బాలీవుడ్లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన.. ప్రస్తుతం క్యారెక్టర్ నటుడిగా బిజీ. రీసెంట్గా ‘యానిమల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన అనిల్ కపూర్.. 45ఏండ్ల విరామం తర్వాత మళ్లీ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా మరేదోకాదు.. ఎన్టీఆర్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్). ఎన్టీఆర్ నటజీవితంలోనే గొప్ప సినిమాగా ‘డ్రాగన్’ని మలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఇప్పటికే చాలావరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కు సిద్ధం అవుతున్నది. ఈ షెడ్యూల్లోనే అనిల్ కపూర్ జాయిన్ అవుతారట. ఇందులో ఆయన కీలకపాత్రను పోషిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. డిసెంబర్లో మొదలుకానున్న ఈ షెడ్యూల్లో అనిల్కపూర్పై కీలక సన్నివేశాలను తీస్తారట ప్రశాంత్‌నీల్. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.