‘ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయ్యాను. గత 25ఏళ్లుగా తెలుగువారు నన్ను ఆదరిస్తున్నారు. ఓ హీరోకి, అభిమానికి మధ్య ఉండే డివైన్ ఎమోషన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు’ అని అన్నారు అగ్ర నటుడు ఉపేంద్ర. ఆయన వెండితెర సూపర్‌స్టార్ సూర్యగా కీలక పాత్రలో నటించిన ‘ఆంధ్రకింగ్ తాలూకా’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామ్ హీరోగా మహేష్‌బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో ఉపేంద్ర మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. చిత్ర నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ ‘లాంగ్న్ ఉండే సినిమా ఇది. మూడువారాల పాటు బాగా పర్ఫార్మ్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
ఈ రోజుల్లో నిర్మాతకు అండగా ఉండే హీరోలున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత రవిశంకర్ బదులిస్తూ “రంగస్థలం’ విషయంలో రామ్‌చరణ్ తన రెమ్యునరేషన్ బ్యాలెన్స్‌ను చాలా రోజుల తర్వాత తీసుకున్నారు. ‘సర్కారు వారి పాట’ రిలీజైన ఏడాదికి మహేష్‌బాబు రెమ్యునరేషన్ అందుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ కోసం చిరంజీవి, రవితేజ ఇలాగే చేశారు. పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్, ఉపేంద్ర కూడా నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అందరికీ డబ్బే ముఖ్యం కాదు. నిర్మాతకు అండగా ఉండే హీరోలున్నారు’ అని చెప్పారు. ఓ అభిమాని కథగా ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నదని దర్శకుడు మహేష్‌బాబు పి పేర్కొన్నారు.