Rakhi Sawant | బాలీవుడ్ సెక్స్ క్వీన్‌గా పేరుగాంచిన రాఖీ సావంత్ (Rakhi Sawant).. తన చేష్టలు, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్ ఖాన్ దురానీ (Adil Khan Durrani)ని రహస్యంగా వివాహం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో విడిపోయింది. తాజాగా రాఖీ సావంత్ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు (Pakistani Actor), నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది రాఖీ. పెళ్లి విషయంలో తనకు చాలా ప్రతిపాదనలు వస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్ (Dodi Khan)ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. గతంలో జరిగిన వివాహాల కారణంగా తాను ఎలా వేధింపులకు గురయ్యానో ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. పాకిస్థాన్‌లో తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని.. ఆ దేశ ప్రజలను తాను ప్రేమిస్తున్నట్లు పేర్కొంది.
డోడి ఖాన్‌తో వివాహం పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చేసుకోనున్నట్లు తెలిపింది. రిసెప్షన్ మాత్రం భారత్‌లో ఉంటుందని… పెళ్లి తర్వాత హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్స్‌కు వెళ్లనున్నట్లు చెప్పింది. చివరిగా పెళ్లి తర్వాత దుబాయ్‌లో స్థిరపడనున్నట్లు రాఖీ సావంత్ వెల్లడించింది. ఇక రాఖీ ప్రకటన నేపథ్యంలో డోడి ఖాన్ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేశాడు. ‘రాఖీ జీ మన బరాత్ భారత్‌లోనా దుబాయ్‌లోనా’ అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో, రాఖీ సావంత్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, రాఖీ సావంత్.. ఆదిల్ ఖాన్ దురానీని రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాము పెళ్లి చేసుకున్నాం అంటూ 2023 జనవరిలో ప్రకటించారు. అయితే వీరి వివాహబంధం ఎన్నో రోజులు కొనసాగలేదు. ఆరు నెలలైనా తిరక్కముందే వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ (Bigg Boss 12 Contestant) సోమి ఖాన్ (Somi Khan)ను రెండో పెళ్లి చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చాడు. అదిల్ కంటే ముందు రాఖీ సావంత్.. వ్యాపారవేత్త అయిన రితేష్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ 14లో కూడా పాల్గొన్నారు. అయితే, 2022లో వీరు విడిపోయారు. ఇప్పుడు రాఖీ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైంది.
Also Read..
Nayanthara | ధనుష్, నయనతార మధ్య వివాదం.. నెట్‌ఫ్లిక్స్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
Anjali | కొన్ని సార్లు బాధపెడుతుంది.. గేమ్ ఛేంజర్‌పై అంజలి కామెంట్స్ వైరల్
NTR Neel | ఏంటీ NTRNeel సినిమా షూటింగ్ మొదలైందా..? తారక్ టీం క్లారిటీ