Anjali| గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్ (Game Changer). శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.
పలు ప్రాంతాల్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. అంజలి నటించిన పార్వతి పాత్రకు మంచి స్పందన వచ్చింది. కాగా అంజలి వన్ ఆఫ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన మద గజ రాజా జనవరి 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషనల్ ఈవెంట్లో గేమ్ ఛేంజర్ ఫలితంపై అంజలిని రిపోర్టర్లు పలు ప్రశ్నలు అడిగారు.
ఓ నటిగా నా బాధ్యతను నిర్వర్తించా. ఈ పాత్ర కోసం నేను 200 శాతం పనిచేశాను. సినిమా రన్ అయ్యేందుకు ప్రమోషన్స్ చేస్తూ జనాల దగ్గరకెళ్తాం. ఈ సినిమాను నేను చాలా నమ్మాను. గేమ్ ఛేంజర్ విషయంలో నేను సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే ఈ సినిమా చూసిన జనరల్ ఆడియెన్స్ ఎవరూ బాగాలేదని చెప్పలేదు. ఒక మంచి సినిమా చూశామని చెప్పారంది అంజలి.
సినిమా బాగుండటం వేరు.. మంచి సినిమా వేరు. గేమ్ ఛేంజర్ మంచి సినిమా. మీరు చాలా బాగా యాక్ట్ చేశారని నాకు చెప్పారు. అది చాలు నాకు .. కానీ కొన్ని సార్లు ఇలా జరుగడం బాధపెడుతుందంటూ చెప్పుకొచ్చింది అంజలి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి