Thalaivar 171 | ఏడు పదుల వయస్సు దాటినా అభిమానుల కోసం ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). తలైవా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. రజినీకాంత్ ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది తలైవాకు 169వ ప్రాజెక్ట్. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించేశాడు.
టాప్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న తలైవా 170 వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. త్వరలోనే తలైవా 171 అప్డేట్ కూడా రాబోతుంది. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. లోకేశ్ కనగరాజ్, రజినీకాంత్‌ను త్వరలోనే కలువబోతున్నాడని, తలైవా 171 సినిమాను లోకేశ్ గత చిత్రాలను తెరకెక్కించిన నిర్మాతల్లో ఒకరు నిర్మించబోతున్నారని జోరుగా చర్చ నడుస్తోంది.
ఈ చిత్రాన్ని కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఏ జోనర్లో రాబోతుందనేది తెలియాల్సి ఉంది. కాగా యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, మోహన్ లాల్, సునీల్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి గ్యాప్ లేకుండా సినిమాలను లైన్లో పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు రజినీకాంత్.
#LetsCinema EXCLUSIVE: Latest buzz is that Superstar Rajinikanth will be teaming up with Lokesh Kanagaraj for a project under RKFI. pic.twitter.com/o3NbR0NG6w
— LetsCinema (@letscinema) April 5, 2023
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
Ustaad Bhagat Singh | ఎన్నాళ్లో వేచిన ఉదయం.. హరీష్ శంకర్ ఉస్తాద్భగత్ సింగ్ అప్డేట్
Pushpa : The Rule | అసలు పుష్ప ఎక్కడ..? అల్లు అర్జున్ పుష్ప.. ది రూల్ స్టన్నింగ్ అప్డేట్
Leo | విజయ్, లోకేశ్ కనగరాజ్ లియో కొత్త అప్డేట్