టాలీవుడ్ సినీ జనాలు గబ్బర్‌సింగ్ కాంబినేషన్ కోసం చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) క్రేజీ కలయికలో రెండో సినిమా వస్తుందని తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీ షూటింగ్ అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణ సినిమాలోని ఎన్నాళ్లో వేచిన ఉదయం సాంగ్‌ను షేర్ చేస్తూ.. ఆ రోజు రానే వచ్చింది.. అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్లో కొత్త లుక్‌తో కనిపించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో తాను ఇదే లుక్‌లో కనిపించబోతున్నానంటూ.. హింట్ ఇచ్చేశాడు పవన్ కల్యాణ్.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం పవన్ కల్యాణ్ బల్క్ డేట్స్ ఇచ్చాడని.. సుమారు 90 రోజులు షూటింగ్‌కు కేటాయించబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో భారీ సెట్ కూడా వేశారు. పవన్ కల్యాణ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో నటిస్తోన్న వినోదయ సీతమ్ రీమేక్‌లో కూడా నటిస్తున్నాడు. దీంతోపాటు సుజిత్ డైరెక్షన్లో ఓజీ (OG) కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా త్వరలోనే షూటింగ్ షురూ కానున్నట్టు తెలుస్తోంది.
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023