Pushpa : The Rule | మూవీ లవర్స్‌తోపాటు పుష్పరాజ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషించిన పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa : The Rule). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ముందుగా ప్రకటించిన ప్రకారం స్టన్నింగ్ అప్డేట్ను అందించారు.
పుష్పరాజ్ ఎక్కడ..? సెర్చ్ త్వరలోనే ముగుస్తుంది.. రూలింగ్‌కు ముందు పుష్పరాజ్ వేట.. ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 గంటలకు అదేంటో చెప్పబోతున్నాం.. అని స్టన్నింగ్ అప్డేట్ వీడియోను షేర్ చేశారు. అల్లు అర్జున్ బైక్‌పై సూపర్ ఫాస్ట్‌గా పారిపోతున్న విజువల్స్‌తో షురూ అయిన వీడియో.. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ..? అనే డైలాగ్స్‌తో సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
మరోవైపు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న అందమైన శ్రీవల్లి (రష్మిక మందన్నా)కి పుష్ప.. ది రూల్ టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. సీక్వెల్లో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నాహీరోయిన్గా మరోసారి సందడి చేయనుంది. మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్, సునీల్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా సంగీతం అందిస్తున్నాడు.
పుష్పరాజ్ ఎక్కడ..?
#WhereIsPushpa ?
The search ends soon!The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/djm4ClLeHg
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
శ్రీవల్లికి బర్త్ డే విషెస్..
Team #PushpaTheRule wishes the gorgeous ‘Srivalli’ aka @iamRashmika a very Happy Birthday ❤️
May you continue to RULE our hearts ❤️🔥
Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/wNbsDxOUys
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
Read Also :
Ustaad Bhagat Singh | ఎన్నాళ్లో వేచిన ఉదయం.. హరీష్ శంకర్ ఉస్తాద్భగత్ సింగ్ అప్డేట్