Leo | విజయ్, లోకేశ్ కనగరాజ్ లియో కొత్త అప్డేట్
Leo | విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లియో (Leo.. Bloody Sweet). ఇప్పటికే విడుదలైన లియో టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం లియో కొత్త షెడ్యూల్ షురూ అయింది.
Leo | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లియో టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఇటీవలే లియో కశ్మీర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం లియో కొత్త షెడ్యూల్ ఇవాళ చెన్నైలో షురూ అయింది.
తాజా షెడ్యూల్ 17 రోజులపాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కొత్త షెడ్యూల్ కోసం విజయ్ టీం హైదరాబాద్‌కు రానుందట. లియో ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దళపతి 67గా వస్తున్న లియో చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లియో చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు.
మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి విజయ్ను స్టన్నింగ్ పక్కా మాస్ అవతార్‌లో చూపించబోతున్నట్టు టైటిల్ గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు లోకేశ్ కనగరాజ్. ఈ ఏడాది వారిసు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు విజయ్. తెలుగలో వారసుడు టైటిల్‌తో విడుదలై మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..
కశ్మీర్ లొకేషన్లో త్రిష..
#Leo girl #Trisha Instagram Story From Kashmir 🥶❤️@actorvijay 👑 pic.twitter.com/03E5ft3Da2
— #Leo (@VijayFanCraze) February 18, 2023
Read Also :
Ustaad Bhagat Singh | ఎన్నాళ్లో వేచిన ఉదయం.. హరీష్ శంకర్ ఉస్తాద్భగత్ సింగ్ అప్డేట్
Pushpa : The Rule | అసలు పుష్ప ఎక్కడ..? అల్లు అర్జున్ పుష్ప.. ది రూల్ స్టన్నింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

