Hema Committee Report – Rajinikanth | మలయాళంలో సంచలనాలు సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్‌పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు తనకు హేమ కమిటీ ఏంటో తెలిదని రజనీకాంత్ వెల్లడించాడు. మలయాళం సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. అయితే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఇప్పటికే అగ్ర నటులతో పాటు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.
ఇదిలావుంటే మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చతో పాటు హేమ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు సంబంధించి రజనీకాంత్ మలయాళం సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలియదని వెల్లడించాడు. చెన్నై విమానాశ్రయం నుంచి వస్తున్న రజనీకాంత్‌ను మీడియా ప్రశ్నిస్తూ.. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ వంటి వాటిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం హేమా కమిటీని వేసినట్లు.. తమిళ సినిమా కోసం ఇలాంటి కమిటీని వేస్తారా అని రజనీని అడుగగా.. తలైవర్ సమాధానమిస్తూ.. నాకు నాకు హేమ కమిటీ రిపోర్ట్ అంటే ఏంటో తెలీదు క్షమించండి. దీనిపై తర్వాత మాట్లాడుతాను అంటూ వెల్లడించారు.
ALso Read..