Rajinikanth Vs Vijay | తమిళనాడు సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో సెప్టెంబర్ 13 చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంతకీ కారణమేంటనుకుంటున్నారా.. ? ఓ స్టార్ యాక్టర్ కమ్ పొలిటీషియన్ తన 98వ రోజు పొలిటికల్ టూర్‌ను ప్రారంభించాడు. ఇదే సమయంలో మరో స్టార్ హీరోనేమో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ప్రశంసించాడు. ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒకరు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మరొకరు స్టార్ యాక్టర్ తమిళగ వెట్రి కళగమ్ చీఫ్ దళపతి విజయ్.
2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా విజయ్ శనివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 98వ రోజు పొలిటికల్ టూర్‌ను తిరుచ్చిలో ప్రారంభించిన విషయం తెలిసందే. అయితే ఇదే రోజు సాయంత్రం తలైవా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను ప్రశంసించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.‘ నా స్నేహితుడు, గౌరవీనయులైన తమిళనాడు ముఖ్యమంత్రి’ అంటూ మొదలుపెట్టిన తలైవా ఎంకే స్టాలిన్‌ను ‘స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’ అని సంబోంధించాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నోట ఒక్కసారిగా ఇలాంటి కామెంట్ చేయడం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పాత, కొత్త పార్టీలకు సవాలుగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ తన 98వ రోజు పొలిటికల్ టూర్‌ను ప్రారంభించిన రోజే రజినీకాంత్ సీఎం స్టాలిన్‌ను ప్రశంసించి అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటున్నాడు. అయితే విజయ్ పొలిటికల్ టూర్ మొదలు పెట్టిన ఈ రోజునే రజినీకాంత్ ఎంకే స్టాలిన్‌ను ప్రశంసించేందుకు ఎందుకు ఎంచుకున్నాడనేదానిపై చర్చించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు స్టాలిన్‌తోపాటు ఈ ఇద్దరు స్టార్ యాక్టర్ల అభిమానులు.
రజినీకాంత్ ఇప్పటిదాకా విజయ్‌కు మద్దతు తెలపలేదని తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో తలైవా సపోర్ట్ ఎంకే స్టాలిన్‌కే ఉండబోతుందా..? విజయ్‌కు తలైవా నుంచి ఎలాంటి మద్దతు ఉండదా..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Disha Patani | దిశా పటాని ఇంటిపై కాల్పులు.. ఇన్‌స్టాలో బాలీవుడ్ బ్యూటీ ఫస్ట్ పోస్ట్ ఇదే..!
Nani | నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఊహించని ట్విస్ట్.. మోహన్‌బాబు కీలక పాత్ర, చిరంజీవి క్యామియో?
SSMB29 New Schedule | రామోజీ ఫిల్మ్ సిటీలో SSMB29.. మొదలైన కొత్త షెడ్యూల్