రజనీకాంత్ అభిమానులకి గుడ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్(Rajinikanth) డిశ్చార్జ్ అయ్యారు. తాను ఇంటికి చేరుకున్న విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. చికిత్స పూర్తైంది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు పడాలని ప్రార్థనలు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు.
ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక రజనీకాంత్‌కి కాస్త నలతగా అనిపించడంతో ఆయన కావేరి ఆసుపత్రిలో(Kaveri Hospital) అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఆయన్ని పరిశీలించి మెదడులోని నరాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి చికిత్స అందించారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు.దీంతో రజనీకాంత్ శస్త్ర చికిత్సకు ఓకే చెప్పడంతో కరోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. రెండు రోజుల పాటు హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకున్న రజినీకాంత్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. తలైవా నటించిన అన్నాత్తె చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్ కానుంది.
Puneet Raj Kumar: పునీత్ నుదుటిపై ముద్దు పెట్టిన సీఎం బొమ్మై
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు