Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం కూలీ (Coolie)సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. తలైవా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ కోసం థాయ్‌లాండ్‌కు కూడా పయనమయ్యాడు. కూలీ 70 శాతం షూటింగ్ పూర్తయిందని.. నెక్ట్స్ షెడ్యూల్ జనవరి 13 నుంచి జనవరి 28 వరకు కొనసాగుతుందని కూడా చెప్పాడు. కూలీ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే కూలీ అనుకున్న సమయానికి రావడం లేదన్న వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ మూవీని ఆగస్టు 14న విడుదల చేస్తున్నారంటూ ఓ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇదే నిజమైతే ఇంతకీ కారణమై ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మరి దీనిపై మేకర్స్ ఏదైనా స్పష్టత ఇస్తారేమో చూడాలి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కూడా ఇదే రోజు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం.
లోకేశ్ కనగరాజ్ టీం ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ షూట్ షెడ్యూల్లో భాగంగా సంబార్ లేక్ ప్రాంతంలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, తలైవా, రెబా మోనికా జాన్ అండ్ టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారిన తెలిసిందే. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్ండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#Coolie Plans For Aug14th Release 😎 pic.twitter.com/fmxPazUNP3
— Trendsetter Bala (@trendsetterbala) January 8, 2025
Oscars 2025 | ఆస్కార్స్ 2025.. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఐదు భారతీయ సినిమాలివే..!