Athreyapuram Brothers | విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాజీవ్ కనకాల. ఈ టాలెంటెడ్ యాక్టర్ కీ రోల్లో నటిస్తోన్న చిత్రం ఆత్రేయపురం బ్రదర్స్. రాజేశ్ జగన్నాథం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గవిరెడ్డి, సన్నీపట్సా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది.
ముహూర్తపు షాట్‌కు బింబిసార ఫేం వశిష్ఠ క్లాప్ కొట్టగా.. విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్లు ప్రవీన్ కండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కు అందజేశారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించాడు.
A Sweet Rivalry ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీ కాన్పెప్ట్ పోస్టర్ ఇద్దరు వ్యక్తుల బలపరీక్ష చేసుకుంటున్నట్టుగా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఎస్2ఎస్ సినిమాస్, ది ఫర్వెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వీఎస్కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేశ్ గద్దె, రాకేశ్ గద్దె సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రఘుబాబు, సిద్దార్థ్ గొల్లపూడి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#AthreyapuramBrothers begins its journey with a grand pooja ceremony!
Clap by @DirVassishta
Camera Switch On by @DirVijayK
First Shot Directed by @anudeepfilm
Shoot begins soon 🤞🏽
Script Handover by @praveenfilms & #AdityaHasan@Rajesh_tweetss @Actor_Gavireddy @Sunnypatsa… pic.twitter.com/YmAEQpS73Y
— BA Raju’s Team (@baraju_SuperHit) January 21, 2026
#AthreyapuramBrothers– A Sweet Rivalry 🎬 Shoot Begins Soon 🔜 pic.twitter.com/hRq248rFeZ
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) January 21, 2026
Chiru 158 | చిరంజీవి–బాబీ కొల్లి కాంబోపై అంచనాలు .. కృతి శెట్టి పాత్రపై తొలగిన అనుమానాలు