Gods and Soldiers | ‘గోలీసోడా’, గోలీసోడా-2 చిత్రాల దర్శకుడు, ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్ డైరెక్షన్లో గోలీసోడా ఫ్రాంఛైజీలో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీతో రాజ్‌తరుణ్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రానికి టైటిల్‌ని ఫిక్స్ చేసి.. టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు
ఈ చిత్రం రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జరుపుకుంటోంది. ప్రముఖ తమిళ హీరోలు విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్యలతోపాటు మాస్ కా దాస్ విశ్వక్సేన్ తమ ఎక్స్ అకౌంట్ వేదికగా టైటిల్‌ను ట్విట్ చేసి శుభాకాంక్షలు రాజ్ తరుణ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. ‘గోలీసోడాలోని రఫ్‌నెస్‌ను, న్యూ చాప్టర్లో ఈ సినిమాలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఈ టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌తో మా సినిమాపై ఆడియన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. తప్పకుండా మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందరి అంచనాలను అందుకుంటుంది. ఈ సందర్బంగా మా టైటిల్ టీజర్‌ను తమ సోషల్ మీడియాలో షేర్ చేసి మమ్ములను సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు’ అన్నారు.
ఈ మూవీలో సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత ఈ చిత్రంలోముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి పాపన్ జేఆర్ ఎడిటర్, యాక్షన్: కలై కింగ్సన్, విక్రమ్ మౌర, రచన-ఫొటోగ్రఫీ-దర్శకత్వం: విజయ్ మిల్టన్.
టైటిల్ టీజర్..
We at Rough Note Productions are delighted to share the much-awaited Title Logo of our upcoming film! ✨
The **#GoliSodaLegacy** continues, as Tamil rap star @vedanwithword joins us with a powerful song 🎤🔥 and @paal_dabba makes his debut on the big screen 🌟
Written &… pic.twitter.com/rZuBn7FUXz
— sd.vijay milton (@vijaymilton) August 27, 2025
Kotha Lokah | మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ.. ‘కొత్త లోక’ ట్రైలర్ రిలీజ్
Kingdom Movie | ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. ఎక్కడ చూడోచ్చంటే.!