Kotha Lokah | సినిమా ప్రేక్షకులను అలరించేందుకు మలయాళం నుంచి మరో సూపర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్పటికే మలయాళం నుంచి వచ్చిన సూపర్ హీరో మూవీ మిన్నల్ మురళి సూపర్ హిట్ అందుకోగా.. తాజాగా మరో చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. మలయాళ నటులు కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కొత్త లోక’ (Kotha Lokah). చాప్టర్ 1 చంద్ర. ఈ సినిమాకు డామినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. వేఫర్ర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 29ర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో అసాధారణ శక్తులు ఉన్న ‘లోక’ అనే పాత్రలో కనిపించబోతుంది. ఆమె వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఎందుకు తన పద్ధతిని మార్చుకోవలసి వచ్చింది, మరియు ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనే అంశాల చుట్టూ కథనం సాగుతుందని అర్థమవుతుంది. శక్తివంతమైన పాత్రలో కళ్యాణి ఎలా మెప్పించిందో సినిమా చూసి తెలుసుకోవాలి.