Karavali Glimpse | యాక్టర్‌గా, దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా కన్నడ సినీ పరిశ్రమలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాజ్ బీ శెట్టి. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నిర్మించిన సు ఫ్రమ్ సో ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 8న తెలుగులో విడుదల కానుంది. కాగా రాజ్ బీ శెట్టి వన్ ఆఫ్ ది కీ రోల్లో నటిస్తోన్న చిత్రం కరవాలి. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్నాడు.
గురుదత్ గనిజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి రాజ్ బీ శెట్టి ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్‌ను షేర్ చేశారు. రాజ్ బీ శెట్టి రెండు దున్నల మధ్య నిలబడి చేతిలో కాగడ పట్టుకుని కనిపిస్తున్నాడు. సినిమాలో గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ గురుదత్ గనిగ మాట్లాడుతూ.. కర్ణాటక తీరప్రాంతంలో కరవాలి సినిమాను షూట్ చేశామని.. మనుగద, విధేయత, మనిషి స్వభావం వంటి అంశాల చుట్టూ సినిమా కథ ఉంటుందని చెప్పాడు. జంతువు Vs మానవుడు ట్యాగ్‌లైన్ ఉంటుందని చెప్పాడు. ఈ మూవీలో ప్రజ్వల్ దేవరాజ్, రాజ్ బీ శెట్టితోపాటు మిత్రా, రమేశ్, ఇందిరా సంపద ప్రధాన పాత్రల్లో నటించారని చెప్పారు. వీకే ఫిల్మ్ అసోసియేషన్, గనిగా ఫిల్మ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పోస్ట్ ఫ్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.
Introducing #RajBShetty as #Maveera
The legend of #Karavali’s Kambala comes alive once more.
This glimpse plunges you into the raw, intense world of coastal valor.
The roar of the land begins…
👉 https://t.co/LnQ8CWR69S@RajbShettyOMK @gurudath_ganiga @pinkticketsoff… pic.twitter.com/r0ZNEH4CsM
— BA Raju’s Team (@baraju_SuperHit) August 7, 2025
COtton Crop | పత్తిలో అంతర పంటల సాగుతో చీడ పీడల నివారణ : శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి
Harish Rao | రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలను కష్టాల పాలు చేసింది : హరీశ్ రావు
BRS | కార్యకర్తలకు బీఆర్ఎస్ పాటీ అండగా ఉంటుంది : వల్లుంపల్లి కరుణాకర్