Awwal Dawath | నాటు నాటు సాంగ్‌తో వరల్డ్‌వైడ్‌గా సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించాడు టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఈ క్రేజీ గాయకుడి పాట వస్తుందంటే జోష్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి పాటే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదే అమీర్ లోగ్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తున్నారు.
రమణారెడ్డి సోమ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే శ్రీవిష్ణు లాంచ్ చేసిన అమీర్ లోగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన అవ్వల్ ధావత్ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ మాసీ వాయిస్, మరోవైపు ఆనీ మాస్టర్ మాస్ డ్యాన్స్‌తో ఫ్లోర్ దద్దరిల్లిపోయేలా సాగుతున్న ఈ సాంగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ, మ్యూజిక్ లవర్స్.
అమీర్ లోగ్ మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మూవీలో వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The celebration just got bigger! 🥳#AwwalDawath from #AmeerLog crosses 1 Million+ views 💥
Sung by @Rahulsipligunjhttps://t.co/theJNCOl0g@Awwal_Films @instone129 #RamanaReddy @mcharimusic @manojoriginal @frame_it_right #AneeMaster #JulooriManojkumar@Vedhajalandharr… pic.twitter.com/yC7k6jgEik
— Ramesh Bala (@rameshlaus) January 14, 2026
Konaseema | కోనసీమలో రికార్డింగ్ డ్యాన్స్ కలకలం.. డాన్సర్లను బట్టలు విప్పమన్న జనసేన నేత!