Rahul Ramakrishna | సైన్మా(షార్ట్ ఫిల్మ్), అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్, బ్రోచేవారేవురా, హుషారు చిత్రాలతో తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ తొలిసారి మెగాఫోన్ పడుతున్నాడు. తాను ఒక సినిమా తీయబోతున్నట్లు ఈ సినిమాలో నటించేందుకు కేవలం 25 నుంచి 35 ఏండ్లు ఉన్న అమ్మాయిలు మాత్రమే కావాలని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అయితే దీనికి సెటైరికల్‌గా స్పందించాడు నటుడు ప్రియదర్శి.
రాహుల్ పోస్ట్ కింద కామెంట్ పెడుతూ.. పురుష నటులు ఒద్దా సార్?.. ఫెమినిస్టిక్ సినిమా నా భయ్యా? షఓ రీల్స్ అంటే రీల్స్ కూడా సెండ్ చేయొచ్చా బ్రో.. ఎక్కువ వ్యూస్ లేవు ఆ వీడియోకి..? మీరు దర్శకుడు అంటే హీరో ఎవరు అన్నా? ఇది అవార్డ్స్ టైపు మూవీ అహ్ అండి? ఫ్యాన్స్ ప్రశ్నలు జల్దీ చెప్పు అంటూ ప్రియదర్శి కామెంట్ చేశాడు.
అయితే దీనికి రాహుల్ రామకృష్ణ బదులిస్తూ.. నువ్వు ఇన్ని ప్రశ్నలు నువ్వు చేసిన కొన్ని సినిమాలు చేయక ముందు అడిగి ఉండాల్సిందంటూ సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు.
1) Male actors oddha saar?
2) Feministic movie na bayya?
3) Showreels ante Reels kooda send cheyyocha bro? Ekkuva views levvu.
4) Meeru director ante hero evalu anna?
5) Idhi awards type movie ah andi?Fans questions, zaldi cheppu!
— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) June 14, 2025
Read More