Raayan Movie | సినీ ఇండస్ట్రీని ప్రస్తుతం పైరసీ అనే భూతం పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని వదిలించేందుకు ఎంతమంది ప్రయత్నించినా.. సరైన పరిష్కారం దొరకట్లేదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్నసినిమాల వరకు ఈ పైరసీ భూతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా ధనుష్ నటించిన రాయన్ సినిమాకు కూడా పైరసీ బెడద తాకగా రాయన్‌ను పైరసీ చేస్తున్న తమిళ్ రాకర్స్ సభ్యుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
ధనుష్ రాయన్ సినిమా పైరసీ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయంపై చిత్రబృందం సైబర్ పోలీసులకు కంప్లయిట్ ఇవ్వగా.. సైబర్ పోలీసులు దీని వెనుక తమిళ రాకర్స్ మాఫియా ఉన్నట్లు గుర్తించారు. అయితే తమిళనాడులో కాకుండా కేరళలో ఈ పైరసీని చేస్తున్నట్లు సమాచారం రావడంతో థియేటర్‌కు వెళ్లగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమిళ్ రాకర్స్ సైట్ అడ్మిన్ జెబ్ స్టీఫెన్‌రాజ్ తన ఫోన్లో రాయన్ చిత్రాన్ని రికార్డ్ చేస్తుండగా కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. అనంతరం తమిళనాడు పోలీసులకు అప్పగించారు.
మదురైకి చెందిన జెబ్ స్టీఫెన్‌రాజ్ కొత్త సినిమాలను అక్రమంగా ఇంటర్నెట్లో విడుదల చేసే తమిళ రాకర్స్‌లో సభ్యుడు. కేరళలోని తిరువనంతపురంలోని ఏరియాస్ థియేటర్లో సినిమా రికార్డింగ్ చేస్తుండగా జెబ్ స్టీఫెన్రాజ్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో అతడు సంచలన విషయాలను వెల్లడించాడు.
అతడు థియేటర్లో పైరసీ చేసే విధానంపైనా పోలీసులకు కీలక వివరాలు అందించారు. సినిమా విడుదల రోజే ఆరు నుంచి ఏడు వెనక వైపు సీట్లను తమిళ్ రాకర్స్ సైట్ సభ్యులు బుక్ చేస్తారని, మొబైల్ ఫోన్ బ్రైట్నెస్ తగ్గించి సీటుపై కప్ హోల్డర్‌పై మొబైల్ ఫోన్ పెట్టుకుని థియేటర్ వెనుక సీట్లో కూర్చుని సినిమాని కాపీ చేస్తారని పోలీసులు వెల్లడించారు.
Also Read..