లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన మాతా ప్రసాద్ పాండే (Mata Prasad Pandey) ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో 81 ఏళ్ల సీనియర్ నాయకుడైన మాతా ప్రసాద్ పాండేను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నియమించారు. సిద్ధార్థనగర్ జిల్లాలోని ఇత్వా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాతా ప్రసాద్ పాండే, రెండు సార్లు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.
కాగా, యూపీ మాజీ మంత్రి, కాంత్ ఎమ్మెల్యే కమల్ అక్తర్ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ విప్‌గా, రాణిగంజ్ ఎమ్మెల్యే రాకేష్ కుమార్ వర్మ ఆ పార్టీ డిప్యూటీ విప్‌గా ఉన్నారు.