Rise of Ram song from RRR | కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జనవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచేశాడు జక్కన్న. ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా చిత్ర యూనిట్ దేశమంతటా పర్యటిస్తూ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఎన్టీఆర్‌కు సంబంధించి కొమురం భీముడో పాటను రిలీజ్ చేసింది ట్రిపుల్ ఆర్ టీం. ఇప్పుడు రామ్‌చరణ్‌కు సంబంధించి రైజ్ ఆఫ్ రామ్ పాటను రిలీజ్ చేసింది.
న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్ టీం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. రామ్‌చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను తెలియజేసే రైజ్ ఆఫ్ రామ్ పాటను విడుదల చేసింది. రామం రాఘవం.. రణధీరం రాజసం ( Raamam Raaghavam ) అంటూ సాగే ఈ పాటను కె.శివదత్తా రాశారు. ఈ పాట ఆద్యంతం సంస్కృతంలోనే ఉండటం విశేషం. ఈ పాటను విజయ్ ప్రకాశ్, చందన బాల ప్రకాశ్, చారు హరిహరణ్ పాడారు. ముఖ్యంగా ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం ఈ పాటను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి రిలీజ్ చేసిన ఈ పాట గూస్బంప్స్ తెప్పించేలా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR ప్రమోషన్స్ కోసమే అంత ఖర్చు పెడుతున్నారా..? (ntnews.com)
సీక్రెట్‌గా విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఏడాది తర్వాత రివీల్
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Ram Charan Co star | ఈ హీరో డ్యాన్స్ ను రాంచరణ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాడట
Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
ట్రిపుల్ ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన తరణ్ ఆదర్శ్