Janatha bar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ రాయ్‌లక్ష్మీ (Raai Laxmi). ఈ బ్యూటీ లీడ్ రోల్లో నటించిన చిత్రం జనతాబార్ (Janatha bar). రమణ మొగిలి దర్శ్తకత్వం వహించిన ఈ మూవీ గతేడాది తెలుగు, తమిళ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది.
స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ నేపథ్యంలో తెరకెక్కింది జనతా బార్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ మూవీ కన్నడలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టి ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో సాగే ఈ మూవీ థ్రియాట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీలో కూడా సందడి చేయనుంది.
కాగా ఇక హిందీలో కూడా సందడి చేయనుంది జనతా బార్. ఈ మూవీని కేరళ, హిందీ ప్రేక్షకుల కోసం విడుదల కానుంది. మరింత ఎక్కువమందికి చేరువేయ్యేలా మేకర్స్ ఈ డెసిషన్ తీసుకోవడంతో రెస్పాన్స్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్ సంస్థ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలోఅమీక్షా పవర్, అమన్ ప్రీత్ సింగ్, శక్తికపూర్, ప్రదీప్‌రావత్, అనూప్‌సోని, విజయ్‌భాస్కర్, మిర్చిమాధవి, రమ్య కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వినోద్ యజమాన్య సంగీతం అందించాడు. సిరాజ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యహరించాడు.