Shabara Teaser | ‘దసరా’, ‘దియా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన టాలెంటెడ్ నటుడు దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబర’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ చూస్తుంటే బంగారం నిధి వేటకి సంబంధించిన నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తుంది.
కిలారు ప్రేమ్ చంద్ దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ పవర్ఫుల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మిషా నారంగ్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ భగత్, రాజీవ్ గోవింద పిళ్ళై, కృతికా సింగ్ యాదవ్, భూషణ్ కళ్యాణ్, ఆరుష్, ప్రమోదిని వంటి పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షిత చదలవాడ, దుర్గ చుంచు మరియు రమాదేవి కిలారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మిథున్ ముకుందన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ, భువనేష్ మణివన్నన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, నటరాజ్ మాడిగొండ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా రూపొందించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, హార్న్‌బిల్ విఎఫ్ఎక్స్ సంస్థ విజువల్స్ తో విజువల్ వండర్ లా అనిపిస్తున్న ఈ టీజర్ ప్రస్తుతం సినీ ప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.