Aakasamlo Oka Tara | దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్రం నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆమె బర్త్డే సందర్భంగా మూవీ నుంచి శృతికి బర్త్డే విషెస్ తెలుపుతూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ మరియు లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదలైన సాత్విక గ్లింప్స్ ఒక పల్లెటూరి అమ్మాయి కలల నేపథ్యంతో ఆకట్టుకోగా, ఇప్పుడు శృతి హాసన్ రాకతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 వేసవిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Shruti Hasan