ఒక అమ్మాయిని ఇష్టపడ్డ ఆర్.నారాయణమూర్తి.. పెండ్లి చేసుకుందాం అనుకుంటే..

ఆర్.నారాయణమూర్తి అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఉద్యమ సినిమాలు. విప్లవకారుడిగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. పీపుల్స్ స్టార్‌గా ఎదిగాడు నారాయణ మూర్తి. దాదాపు 45 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈయన.. పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. విప్లవ భావజాలం ఎక్కువగా ఉన్న నారాయణమూర్తి కావాలనే పెండ్లి చేసుకోలేదని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదంట. మనసుకు నచ్చిన అమ్మాయిని పెండ్లి చేసుకొని ఆనందమైన జీవితం గడపాలని కలలు కన్నాడంట. కానీ జీవితం తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని చెబుతున్నాడు నారాయణమూర్తి. తన లవ్ ఫెయిల్యూర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పాడు.
ఆర్. నారాయణమూర్తి యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెని పెండ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయం అమ్మాయి కుటుంబంతో కూడా చెప్పాడు. కానీ కులాలు వేరుకావడంతో పాటు నారాయణమూర్తి నటుడిగా ఉండటం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో వాళ్లు పెండ్లికి ఒప్పుకోలేదు. అయితే ఇష్టపడిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెండ్లి చేసుకోవడం ఆయన మనసుకు నచ్చలేదు. అదే సమయంలో సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని దానిపై మొత్తం దృష్టి పెట్టాడు. అందుకే ఎవర్నీ పెండ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అయితే పెండ్లి చేసుకోకపోవడం గురించి ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. వయసు పెరుగుతున్నకొద్దీ కచ్చితంగా ఒకరు తోడు ఉండాలని.. అలా తోడు లేని జీవితం నరకం అని ఇప్పటి యువతకు ఆయన సలహా ఇస్తున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని లేకపోతే తర్వాత బాధపడతారని తన అనుభవంతో చెబుతున్నాడు పీపుల్స్ స్టార్.
తన జీవితంలో జరిగిన మరో ఘటన గురించి కూడా ఆర్. నారాయణమూర్తి పంచుకున్నాడు. తన అమ్మ నాన్న ఎంతో మంచివాళ్లని.. కాకపోతే వారికి కులం పట్టింపులు ఎక్కువగా ఉండేవని చెప్పుకొచ్చాడు. అలా ఒకసారి తాను అంటరాని వ్యక్తిని ఆలింగనం చేసుకున్నానే కారణంతో ఇంట్లో నుంచి గెంటేశారని ఎమోషనల్ అయ్యాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan kalyan | రికార్డు రేటుకు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

