Pawan kalyan | భీమ్లా నాయక్ న్యూ రికార్డు.. పెద్ద మొత్తానికి ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్

సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే చాలు.. ఎలా ఉంది అని అడగకుండా థియేటర్‌కు వెళ్లే అభిమానులు చాలామందే ఉన్నారు. స్క్రీన్‌పై పవర్ స్టార్ కనిపిస్తే చాలు చూసి సంబురపడిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అది మెగా బ్రదర్ రేంజ్ !! ఆ క్రేజ్‌కు తగ్గట్టే ఆయన సినిమాలకు జరిగే బిజినెస్ కూడా అలాగే ఉంటుంది. తాజాగా భీమ్లా నాయక్ సినిమాతో కూడా అదే విషయం తెలుస్తోంది. ఇంకా సినిమా షూటింగ్ దశలోనే ఉన్న సినిమాకు అప్పుడే బిజినెస్ మొదలైంది. భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్ విషయంలో కూడా అమెజాన్ ప్రైమ్‌వీడియోస్ పెద్దమొత్తంలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు. ఇందులో ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అయ్యప్పునుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ ఇది . ఆత్మ గౌరవానికి, అహానికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. ఒరిజినల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. అక్కడ రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. అందుకే టైటిల్లో కూడా ఇద్దరి పేర్లు ఉంటాయి. కానీ తెలుగు విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాడు. దీన్ని కేవలం పవన్ సినిమాగానే చూస్తున్నారు. దీనిపై దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియాలో ఓపెన్ అవుతున్నారు. తమ హీరోకు ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాకు 100 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. ఇది కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ చూసి జరుగుతుంది అనేది ఒప్పుకుని తీరాల్సిన సత్యం. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి కూడా చర్చ మొదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మధ్య కాలంలో మరే తెలుగు సినిమాకు ఇవ్వనంత రేటు ఇచ్చి భీమ్లా నాయక్ హక్కులు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత అమెజాన్‌లో ఈ సినిమా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అంతేకాదు స్క్రీన్ ప్లే, మాటలు కూడా రాస్తున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

