Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Arrest | మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో అనుమానిత జైషే ఎ మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాది అరెస్టయ్యాడు. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు అతడిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుడి పేరు మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ (Mohammad Hasan Abu Sarmad Akhtar) గా గుర్తించారు.
Arrest : మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లో అనుమానిత జైషే ఎ మహమ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రవాది అరెస్టయ్యాడు. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు అతడిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుడి పేరు మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ (Mohammad Hasan Abu Sarmad Akhtar) గా గుర్తించారు. ఓ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థలో బైక్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహమ్మద్ హసన్ ఆన్లైన్లో తీవ్రవాద కంటెంట్‌ను వ్యాప్తి చేయడం, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కార్యకలాపాలు చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నట నిఘా వర్గాలు గుర్తించాయి.
వారి సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏటీఎస్ అధికారులు.. ముంబైలోని మహిమ్ మెట్రో స్టేషన్ సమీపంలో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (JeM) కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు. పాకిస్థానీ ఇంటెలిజన్స్ ఆపరేటివ్లతోనూ అతడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మహమ్మద్ హసన్ టెలిగ్రామ్‌లో కొన్ని గ్రూపులు నడుపుతూ.. జైషే చీఫ్ మసూద్ అజార్ ప్రసంగాలను ఇతరులతో పంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ప్రధాని మోదీ ముంబై పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతాలోపానికి సంబంధించిన నివేదికను కూడా అతడు పలు యాప్‌లలో పోస్టు చేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్లో దేశ వ్యతిరేక కంటెంట్ ఉన్నట్లు తెలిపారు. అతడితో సంబంధం ఉన్న వారిని కనుగొనేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

