Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Sunny Deol | ప్రముఖ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ సినిమా విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది.
Sunny Deol | ప్రముఖ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ సినిమా విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. నవంబర్ 20న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన టీజర్ ఇప్పుడు పెను దుమారమే రేపుతోంది. సినిమాలో వైద్య వృత్తిని కించపరిచేలా, ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బందిపై దాడులను సమర్థించేలా దృశ్యాలు ఉన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన ఐఎంఏ.. సినిమా కంటెంట్‌ను సమీక్షించాలని, అవసరమైతే నిషేధం లేదా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వైద్య రంగంలో అవినీతిని, నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడాన్ని తప్పుపట్టమని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉండాల్సిందేనని ఐఎంఏ స్పష్టం చేసింది. అయితే, మొత్తం వైద్య వ్యవస్థను తప్పుగా చిత్రీకరించడం వల్ల సమాజంలో వైద్య సిబ్బందిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

