Kaun Banega Crorepati – Deputy Cm Pawan Kalyan | బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్న సక్సెస్ఫుల్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి(Kaun Banega Crorepati). ఇప్పటికే ఈ షోకి సంబంధించి 15 సీజన్లు రాగా రికార్డు వ్యూస్ అందుకున్నాయి. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16 వ సీజన్ రన్ అవుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ హాజరై సందడి చేసింది. ఇదిలావుంటే తాజాగా ఈ షోలో అమితాబ్ బచ్చన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రశ్న వేశాడు.
ఈ షోలో పాల్గోన్న జంటకు ప్రశ్న అడుగుతూ.. ఇందులో ఉన్న ఏ నటుడు జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంటూ పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఆప్షన్లను ఇచ్చాడు. అయితే ఈ ప్రశ్నకు ఆ జంట సమాధానం చెప్పకపోగా.. ఆడియన్స్ పోల్‌ను అడుగుతారు. దీనికి ఆడియన్స్ పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Question about PowerStar & DyCM #PawanKalyan on #KaunBanegaCrorepati pic.twitter.com/D6RkjJW4fQ
— At Theatres (@AtTheatres) September 14, 2024
Also read..