PVR INOX | భారతదేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (FY) వరుసగా భారీ నష్టాలను చవిచూస్తుంది. కరోనా మహమ్మారి ప్రభావం, ఓటీటీ సవాళ్లు, టికెట్ రేట్లు అధికంగా ఉండడం, సినీ పరిశ్రమలోని మార్పుల కారణంగా ఈ సంస్థ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తాజా ఆర్థిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పీవీఆర్ ఐనాక్స్ నివేదిక ప్రకారం, గత ఐదేళ్లలో సంస్థ ఎదుర్కొన్న నష్టాలు ఈ విధంగా ఉన్నాయి: (ఫైనాన్షియల్ ఇయర్) FY 2020-21లో రూ. 723.50 కోట్లు నష్టాన్ని చవిచూడగా.. FY 2021-22లో రూ. 478.35 కోట్లు FY 2022-23లో రూ.332.98 కోట్లు, FY 2023-24లో రూ. 35.70 కోట్లు, FY 2024-25లో రూ. 276.90 కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తుంది. వరుసగా ఐదేళ్లలో ఈ సంస్థ మొత్తం రూ.1,847.43 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేసింది. ఈ భారీ నష్టాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలాంటి కొత్త వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి.