Spirit | అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas)తో స్పిరిట్ (Spirit). సినిమాను లైన్లో పెట్టాడని తెలిసిందే. రీసెంట్గా ఓ సినిమా ఈవెంట్లో స్పిరిట్ షూటింగ్ ఈ నెల చివరలో మొదలవుతుందని క్లారిటీ కూడా ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. అయితే ఇప్పుడొక ఆసక్తికర వార్త నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం స్పిరిట్ కోసం ప్రభాస్ టెస్టి షూట్ పూర్తయిందట.
తొలిసారి పోలీస్ గెటప్‌లో కనిపించబోతున్న ప్రభాస్ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. టెస్ట్ సీక్వెన్స్‌లో అద్భుతమైన ప్రజెంటేషన్‌తోపాటు సినిమా కోసం తానెంత వరకు అవుట్‌పుట్ ఇవ్వగలుగుతాడో అంతకు సరిపడా గ్లింప్స్‌ను కూడా ఇచ్చేశాడట ప్రభాస్. ఇక ప్రభాస్ టెస్ట్ షూట్‌ను, ట్రాన్స్‌ఫార్మేషన్‌ను దగ్గరుండి చూసిన వారంతా షాకయ్యారని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మొత్తానికి ఈ వార్తలు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రభాస్‌ను ఖాకీ డ్రెస్‌లో ఊహించుకుంటూ డిజైన్ స్టిల్స్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయని తెలిసిందే.
హై ఓల్టేజీ కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా ఫైనల్ అయినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. స్పిరిట్‌లో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ (డాన్ లీ) మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా నటిస్తున్నాడని.. బాలీవుడ్ యాక్టర్‌ను టీంలోకి తీసుకోబోతున్నాడని తెలుస్తుండగా సందీప్ రెడ్డి వంగా టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్‌తో కలిసి సంయుక్తంగా తెరకక్కిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రాణే సంగీతం అందిస్తున్నాడు.
Keerthy Suresh | చాలా బాధగా ఉంది.. AI డీప్‌ఫేక్ చిత్రాలపై కీర్తి సురేష్ ఎమోషనల్
Kapoor Family | కపూర్ ఫ్యామిలీ డిన్నర్లో కనిపించని ఆలియా భట్.. కారణం చెప్పిన అర్మాన్ జైన్!