అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు(Maoists) లేని రాష్ట్రంగా చేయడమే పోలీసుల లక్ష్యమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ( DGP Harish Kumar Gupta ) అన్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్( Maredmilli Encounter ) జరిగిన స్థలాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుందని, ఆరు నెలలుగా రాష్ట్రంలో మావోయిస్టుల కోసం సంభవ్ ఆపరేషన్ పేరిట గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, అందులో భాగంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, టెక్ శంకర్‌తో పాటు దళాలకు చెందిన 13 మంది హతమయ్యారని, 50 మందిని అరెస్టు చేశామని వివరించారు.
ఇప్పటికైన మావోయిస్టుల్లో మిగిలిన వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో ( Mainstream) కలువాలని సూచించారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు. మావోయిస్టు రహిత రాష్ట్రాంగా చేయాలనే లక్ష్యంతో, శాంతి భద్రతలు కాపాడేందుకు ఏపీ పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.