AustraliaVacation | నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కొద్ది రోజుల పాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి, తన కుటుంబంతో, స్నేహితులతో కలిసి గడుపుతున్న విషయం తెలిసిందే. తనకు టైం దొరికినప్పుడల్లా చెల్లితో కలిసి వెకేషన్‌కి వెళుతుంది. తాజాగా సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. పూజా కన్నన్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. దీంతో చెల్లిని కలవడానికి వెళ్లిన సాయి అక్కడ వేకేషన్లో దిగిన ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ ఫోటోలలో సాయి పల్లవి ఎప్పటిలాగే మేకప్ లేకుండా సహజమైన లుక్స్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల నాగ చైతన్యతో కలిసి ‘తండేల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ప్రస్తుతం బాలీవుడ్లో రామాయణ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో సాయి సీత పాత్రలో కనిపించబోతుంది.