Kissik Song | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది టీం. రిలీజ్‌కు ముందే ఏదో ఒక వార్తతో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. మేకర్స్ తాజాగా కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను లాంచ్ చేయగా.. నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
కేవలం 18 గంటల్లోనే 25 మిలియన్లకుపైగా వ్యూస్ రాబట్టింది. కిస్సిక్ సాంగ్ 24 గంటల్లోపే ఈ అరుదైన రికార్డు నెలకొల్పిన దక్షిణాది పాటగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఐకాన్ అల్లు అర్జున్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ట్రీట్‌ను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో ఈ ఒక్క అప్డేట్ చెప్పకనే చెబుతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన కిస్సింగ్ సాంగ్‌లో అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ ఊరమాస్ స్టెప్పులను ప్రేక్షకులను ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
కిస్సిక్ సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం ఖాయమని తాజా వార్త చెప్పకనే చెబుతోంది. శ్రీలీల, బన్నీ స్టైలిష్ డ్యాన్స్ థియేటర్లలో మోత మోగిపోవడం పక్కా అని అర్థమవుతోంది. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.
#KissikSong breaks the highest viewed South Indian song record of 24 hours in just 18 hours 💥💥#Kissik Telugu lyrical video hits Massive 25 MILLION+ VIEWS in a flash ⚡
An Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 dance treat 💥💥
A… pic.twitter.com/T208TrklQM— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2024
కిస్సిక్ ఫుల్ సాంగ్..
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్