Puri Sethupathi | టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. పూరీ- సేతుపతి టీం అప్పుడే మూవీ లవర్స్, అభిమానులకు అదిరిపోయే వార్త షేర్ చేసింది. సినిమా షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించారు మేకర్స్.
నిర్మాత ఛార్మీ కౌర్, విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. సినిమా చివరి రోజు షూటింగ్లో ఈ వీడియో రికార్డ్ చేశారు. ఒకరినొకరం చాలా మిస్ అవుతున్నామని పూరీ, సేతుపతి చెప్పడం చూడొచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎక్జయిటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయని టీం క్లారిటీ ఇచ్చింది.
టైటిల్‌ను ముందుగా ఫిక్స్ చేసిన ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 23న లాంచ్ చేయాల్సింది. కానీ ఆ టైంలో తమిళనాడులో దురదృష్టవశాత్తు ఊహించని ఓ ఘటన జరుగడంతో వాయిదా పడ్డది. త్వరలోనే టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు మరిన్ని క్రేజీ ప్రకటనలు ఉండబోతున్నాయంటోంది పూరీ టీం. పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ సినిమాలంటే జెట్ స్పీడ్‌లో పూర్తవుతాయని తెలిసిందే. ఈ సారి విజయ్ సేతుపతి సినిమాను కూడా అలానే పూర్తి చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు పూరీ జగన్నాథ్.
AR Rahman | మతం పేరుతో చంపడం చాలా తప్పు.. ఇస్లాం మతంలోకి వెళ్లడానికి కారణం ఇదే: ఏఆర్ రెహమాన్