Puri Jagannadh | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లపై సూపర్ క్యూరియాసిటీ ఉంటుందని తెలిసిందే. అలాంటి వాటిలో టాప్‌లో ఉంటుంది చిరంజీవి (Chiranjeevi)- పూరీజగన్నాథ్ (Puri Jagannadh) కాంబో. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా వర్కవుట్ కావడం లేదని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ ఇద్దరి కలయికలో సినిమా గురించి వెయిట్ చేస్తున్న వారి కోసం గాడ్ ఫాదర్ సినిమాతో కొంత ఊరట లభించింది. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన గాడ్ ఫాదర్లో పూరీ జగన్నాధ్ కీలక పాత్రలో నటించాడు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కాగా చాలా రోజులకు చిరు-పూరీ సినిమా వార్త మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
పూరీ ఆటోజానీ స్క్రిప్ట్‌ను చిరంజీవికి వినిపించగా.. సెకండాఫ్ విషయంలో హోల్డింగ్‌లో పెట్టాడని వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా మరోసారి దీనికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. పూరీ మరోసారి ఈ కథలో అవసరమైన మార్పులు చేశాడటజ అంతేకాదు చిరంజీవి కొత్త వెర్షన్‌ను చెప్పబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ, శ్రీకాంత్ ఓదెల లాంటి యంగ్ డైరెక్టర్లతో పనిచేస్తుండగా.. మరి పూరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది.
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్