కన్నడ పవర్ స్టార్ (Sandalwood) పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) మరణించి 5 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన గురించే చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు పెడుతూ కన్నీరు కారుస్తున్నారు అభిమానులు. ఇదంతా ఒక కలలా ఉందని..తమ పవర్ స్టార్ తమను వదిలేసి ఎక్కడికీ వెళ్లలేదని..ఖచ్చితంగా మళ్లీ వస్తాడు అంటూ తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు అభిమానులు. ఆయన తిరిగి రాడని..ఇక లేడు అని అందరికీ తెలుసు. ఈ నిజాన్ని తట్టుకోలేక కొందరు అభిమానులు ప్రాణాలు విడుస్తున్నారు.
ఇప్పటికే కర్ణాటక (Karnataka)లో పునీత్ మరణం తట్టుకోలేక 8 మంది అభిమానులు (Puneeth Rajkumar fan) ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ అనేది కన్నడనాట పేరు కాదు..ఒక ఎమోషన్.. ఒక బ్రాండ్..యూత్ ఐకాన్..ఇలా ఎన్ని పేర్లు అయినా పెట్టుకోవచ్చు. అంతటి ఇమేజ్ సంపాదించుకున్న హీరో ఆయన. అలాంటి నటుడి గుండె ఆగిపోతే అభిమానులు ఎలా తట్టుకుంటారు..? వాళ్ల గుండెలు మాత్రం ఎలా ఆగిపోకుండా ఉంటాయి..? ఇప్పుడు ఇదే జరుగుతుంది. కన్నడనాట పునీత్ మరణించిన విషయం తెలుసుకుని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
కొందరు గుండెపోటు (Heart Attack) తో మరణిస్తున్నారు..మరికొందరు బలవన్మరణం వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా మరో అభిమాని కూడా మరణించాడు. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలిసి అప్పు నువ్వు లేని లోకంలో మీ అభిమానులు కూడా ఉండలేము అంటున్నారు చూడవయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
తమ రాజకుమార ఇక ఎప్పటికీ రాడని..తమకు లేడు అనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. కేవలం సినిమాలు మాత్రమే చూసి పెంచుకున్న అభిమానం కాదు ఇది. ఆయన చేసే సేవా కార్యక్రమాలకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఏటా దాదాపు రూ. 20 కోట్ల నుంచి 30 కోట్లు సేవా కార్యక్రమాల కోసం ఆయన ఖర్చు పెడుతున్నాడనే విషయం తెలిసి అందరూ సలాం చేస్తున్నారు. అలాంటి మానవతావాది మరణం తట్టుకోలేక ఎందరో అభిమానుల గుండెలు ఆగిపోతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?