కన్నడ పవర్‌స్టార్ (Sandalwood) పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) ఆకస్మిక మరణంతో యావత్ సినీపరిశ్రమతోపాటు అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్నారు. తమ అభిమాన నటుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రీల్ లైఫ్ హీరోగానే కాకుండా ఎంతోమందికి జీవితాన్ని అందించి రియల్ లైఫ్‌లో కూడా హీరో అయిపోయాడు పునీత్ రాజ్‌కుమార్. విద్యార్థులు, పేదలకు సాయం చేయడంతోపాటు తన కళ్లు కూడా దానం చేశాడు..
ఇవాళ పునీత్ రాజ్‌కుమార్ మరణించడంతో ఆయన కళ్ల(Puneeth Raj Kumar eyes)ను అవసరమైన వ్యక్తికి పెట్టనున్నారు డాక్టర్లు. పునీత్ రాజ్‌కుమార్ కళ్లను మార్పిడి కోసం తరలిస్తున్న ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. తన తండ్రి సూపర్ స్టార్ రాజ్‌కుమార్ లాగే పునీత్ రాజ్‌కుమార్ కూడా కళ్లను దానం చేసి..తాను అందరిని వదిలివెళ్తూ మరో వ్యక్తికి చూపునందిస్తున్నాడు.
కన్నడ పవర్‌స్టార్‌గా పాపులారిటీ సంపాదించిన పునీత్ రాజ్‌కుమార్‌ది ఎంత గొప్ప మనసో ఈ ఒక్క విషయం చెబుతుంది. పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచాలని నిర్ణయించారు. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను ఆతని తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సమాధి వద్దే నిర్వహించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి