Adipurush | ఆదిపురుష్ పోస్టర్ల చించివేత : మూవీ టీంపై హిందూ మహాసభ ఫిర్యాదు
గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
లక్నో : గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రామాయణాన్ని వక్రీకరిస్తూ, దర్శకుడు ఓం రౌత్ ఇష్టారీతిన దృశ్యకావ్యంలో మార్పులు చేస్తూ ఆదిపురుష్ను తెరకెక్కించారనే విమర్శలు వెల్లువెత్తాయి. వారణాసిలో ఆదిపురుష్ సినిమా పోస్టర్లను కొందరు చించివేశారు.
చిత్ర దర్శక నిర్మాతలపై హిందూ మహాసభ సోమవారం లక్నో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చవకబారు డైలాగ్లతో అజెండాలో భాగంగా ఆదిపురుష్ మూవీని ముందుకు తెచ్చారని, ఇది ప్రజల మనోభావాలను గాయపరుస్తోందని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది. కొన్ని క్యారెక్టర్లను వివాదాస్పదంగా చిత్రీకరించడంతో పాటు అసంబద్ధ డైలాగులను చొప్పించారని నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సినిమా పోస్టర్లను చించివేసిన హిందూ సంఘాల కార్యకర్తలు ఆదిపురుష్ను చూడవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఓ ఆలయంలో సమావేశమైన కార్యకర్తలు సిగ్రా ప్రాంతంలోని మాల్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లక్నోలో హిందూ మహాసభ కార్యవర్గ సభ్యులు హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో చిత్ర నటీనటులతో పాటు దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేశారు.
Read More :
Manipur Violence | మణిపూర్లో ఆగని హింస.. ఇండ్లకు నిప్పు..! కాల్పుల్లో గాయపడ్డ జవాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

