Manipur Violence | మణిపూర్లో ఆగని హింస.. ఇండ్లకు నిప్పు..! కాల్పుల్లో గాయపడ్డ జవాన్..!
Manipur Violence | మణిపూర్లో హింస కొనసాగుతున్నది. కాంటో సంబల్, చింగ్మాంగ్ గ్రామాల్లో ఆదివారం భారీగా కాల్పులు జరిగినట్లు సమాచారం. అదే సమయంలో కంటో సంబల్లోని ఐదు ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. అలాగే పలు ప్రాంతాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.
Manipur Violence | మణిపూర్లో హింస కొనసాగుతున్నది. కాంటో సంబల్, చింగ్మాంగ్ గ్రామాల్లో ఆదివారం భారీగా కాల్పులు జరిగినట్లు సమాచారం. అదే సమయంలో కంటో సంబల్లోని ఐదు ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. అలాగే పలు ప్రాంతాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డాడు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు.
ఆదివారం అర్ధరాత్రి దాటాక సాయుధ దుండగులు కాంటో సంబల్ నుంచి చింగ్మాంగ్ గ్రామం వైపు అకారణంగా కాల్పులు జరిపారని సైన్యం పేర్కొంది. సామాన్యుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ జవాన్ గాయపడ్డాడని, అతన్ని లిమాఖోంగ్ సైనిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా స్థానికుడు ఒకరు మాట్లాడుతూ ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత అనుమానిత కుకీ ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాంటో సంబల్పై కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా ఉగ్రమూకలు ఐదు ఇళ్లకు కూడా నిప్పుపెట్టారని చెప్పాడు. హింసాత్మక ఘటన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించినట్లు బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అధికారి అముతోయ్ పేర్కొన్నారు. నెల కిందట మణిపూర్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. మెయిటీ, కుకీ వర్గాల ప్రజల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో పాటు 11 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిషేధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

