అనతికాలంలోనే తెలుగు సినీరంగంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పుడీ సంస్థ లైనప్‌లో పదిహేను సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది దాదాపు పది చిత్రాలను తెరకెక్కించబోతున్నామని చెప్పారు పీపుల్ మీడియా సంస్థ సారథి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ కథానాయకుడిగా హరీశ్‌శంకర్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శనివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..