Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్న కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కాగా తాజాగా నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా చేసిన కామెంట్స్ మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్‌కు లోను చేస్తున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మేం పార్టు 1, పార్టు 2 కోసం కథ రాశాం. కొన్ని ఎక్జయిటింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులు పార్టు 2ను ఫాలో అయ్యేలా చేస్తాయి. పార్టు 1 కోసం 185 రోజులు షూట్ చేశాం. 2025 చివరలో కానీ 2026 మొదట్లో కానీ పార్టు 2 సెట్స్‌పైకి వెళ్తుంది. 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇలా ఒకేసారి కంగువ పార్టు 1, పార్టు 2 అప్డేట్స్ రావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతుంది.
ఈ మూవీ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో, పోస్టర్లు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. టీజర్ గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలతో సాగుతూ నెట్టింట క్యూరియాసిటీ పెంచుతోంది. కంగువ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తున్నాడు.
కంగువను స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది కంగువ. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
కంగువ గ్లింప్స్ వీడియో..
Sara Ali Khan | అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సారా అలీఖాన్ మెరుపులు
SSMB 29 | అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేశ్ బాబు.. ఎస్ఎస్ఎంబీ 29 క్రేజీ వార్తేంటో తెలుసా..?
Shankar | ఏంటీ ఇండియన్ 2లో కమల్ హాసన్ తక్కువ టైమే కనిపిస్తాడా..? శంకర్ క్లారిటీ
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Disha Patani | దిశా పటానీ టాటూ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఏంటో తెలుసా..?