‘నేను కొంచెం గట్టిగా మాట్లాడితే దిల్‌రాజుకు ఆటిట్యూడ్ వచ్చిందంటారు. హీరో నితిన్‌తో చేసిన రీసెంట్ ఇంటర్వ్యూలో తనలోని గుడ్, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని నితిన్ నన్నడిగాడు. ‘అల్లు అర్జున్కంటే నువ్వే ముందు కెరీర్ మొదలుపెట్టావ్..కానీ ఆయన రేంజ్‌కు వెళ్లలేకపోయావు’ అని ఓ శ్రేయోభిలాషిగా నా మనసులోని మాటను చెప్పా. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. దానిని నెగెటివ్ కోణంలో చూడొద్దు’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. ఆయన నిర్మాణంలో నితిన్ కథానాయకుడిగా నటించిన ‘తమ్ముడు’ చిత్రం ఈ నెల 4న విడుదలకానుంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం దిల్‌రాజు పాత్రికేయులతో ముచ్చటించారు. సినిమా విశేషాలతో పాటు ఇండస్ట్రీ తాజా పరిణామాలపై ఆసక్తికరమైన అంశాల్ని పంచుకున్నారు.