Karuna kumar | మురళీకృష్ణ తుమ్మ డైరెక్ట్ చేసిన డాక్యుమెంటరీ ప్రొద్దుటూరు దసరా (Prodduturu Dasara). ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌కు పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్తోపాటు ఉదయ్ గుర్రాల, విప్లవ్, మహేశ్ శ్ విట్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ప్రొద్దుటూరు దసరా చాలా ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించిందన్నాడు. డాక్యుమెంటరీ అంటే ఇలాగే తీయాలనే రూల్‌ను బ్రేక్ చేశారు. యశ్వంత్ నాగ్ మ్యూజిక్, ఆర్ఆర్, పాట గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. డాక్యుమెంటరీ ఏఐని వాడుకుని గొప్పగా చూపించారన్నాడు.
ప్రొద్దుటూరు దసరాను అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నాడు డైరెక్టర్ మురళీ కృష్ణ. నా వరకు నేను ప్రయత్నించి ఈ డాక్యుమెంటరీ తీశాను. అందరికీ మా డాక్యుమెంటరీ నచ్చుతుందని ఆశిస్తున్నా. నాకు ఈ ప్రయాణంలో సహకరించిన నిర్మాత ప్రేమ్ కుమార్ ధన్యవాదాలు అని తెలిపారు.
Vijayawada Utsav | విజయవాడలో క్రేజీ ఈవెంట్స్.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సందడి..!
Prabhas | డార్లింగ్ అభిమానులకు మాస్ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Unmukt Chand | క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ జీవితంపై డాక్యుమెంటరీ.. ట్రైలర్ రిలీజ్!